పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 షూటింగ్లో రరేపటి నుండి ఆయన జాయిన్ కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
మొదటి భాగం ముగింపునకు కొనసాగింపుగా రాబోతున్న ఈ సెకండ్ పార్ట్లో ప్రభాస్ (భైరవ పాత్ర) మరియు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల తెరకెక్కించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొననుండటంతో చిత్ర యూనిట్లో నూతనోత్సాహం నెలకొంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ ఆలాగే స్పిరిట్ సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు. ఇందులో ఫౌజీ షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. అన్ని కుదిరితే సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























