ది ప్యారడైజ్ ట్రైలర్ విడుదల లేదు

No Trailer Release for Nani’s The Paradise

న్యాచురల్ స్టార్ నాని,యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని అధికారికంగా ధ్రువీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ కట్ చేయడం కంటే సినిమా ఫైనల్ కట్ అలాగే అవుట్‌పుట్‌పైనే పూర్తి దృష్టి సారించాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు నాని తెలిపారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది కావడం, దానికి తోడు ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలోకి వస్తుండటంతో ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మరింత ఆసక్తి నెలకొంది.

ఇక నిన్న ఈసినిమా కోసం ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి నాని , శ్రీకాంత్ ఓదెల తోపాటు చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి హాజరయ్యారు.అయితే ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ కూడా పెద్దగా చేసేలా కనిపించడం లేదు.అలాగే ఈసినిమాను ముందు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేద్దామానుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.