టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ 12న (నేడు) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం తమకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని, గొప్ప ఆశయంతో, ఎంతో ప్యాషన్ మరియు అంకితభావంతో ఈ సినిమాను నిర్మించామని మేకర్స్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక చిరస్మరణీయమైన థియేట్రికల్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కానీ ఊహించని జాప్యాల కారణంగా ‘భోగి’ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా విడుదలకు సంబంధించి వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అభిమానులను మరియు సినీ ప్రియులను కోరారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
చివరి నిమిషంలో ఈ మార్పు జరగడం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెబుతూ, సినిమాను అత్యుత్తమ రీతిలో వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తమకు ప్రేక్షకుల సహనం, మద్దతు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నిరీక్షణకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని చిత్రబృందం హామీ ఇచ్చింది.
1960ల నాటి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నేపథ్యంలో సాగే ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























