సంబరాల ఏటిగట్టు డబ్బింగ్ పనులు షురూ

Sambarala Yetigattu Enters the Dubbing Stage

సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతమయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను దైవ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు మేకర్స్ .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘విరూపాక్ష’ వంటి భారీ హిట్ తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జయప్రకాశ్, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఓవైపు షూటింగ్ చివరి ఘట్టానికి చేరుకోవడం, మరోవైపు డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం కావడంతో సినిమా నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా (జనవరి 12) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.