పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ ‘OG 2’ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగంలో ‘కటానా’ స్వోర్డ్‌తో ఊరమాస్ విధ్వంసం సృష్టించిన ఓజాస్ గంభీరుడి గతాన్ని, ఆయన ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళడానికి గల అసలు కారణాలను ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులతో చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది.
గ్లింప్స్‌లో చూపించిన సుభాష్ చంద్రబోస్, వారియర్ ఎలిమెంట్స్ కథపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సుజీత్ విజన్ పవన్ ఫ్యాన్స్‌కు లార్జర్ ద్యాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. ఓవరాల్ గా తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























