డిసెంబర్‌లో రానున్న విశ్వక్ సేన్ లెగసీ

Legacy Enters Its Final Schedule

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుండి అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళాహి మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేకే మీనన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్ మరియు ఏక్తా రాథోడ్ వంటి పవర్‌హౌస్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పవర్.. పాలిటిక్స్.. బ్లడ్‌లైన్’ అనే ఇంటెన్స్ పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ పూర్తి కావస్తుండటంతో త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు టీజర్ అప్‌డేట్స్‌ను వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.