ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే ?

The Paradise Second Single Release Date Revealed

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను మునుపెన్నడూ లేని రీతిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెరికాలోని డల్లాస్‌లో ఆగస్టు 28న జరగనున్న అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను వేలాది మంది అభిమానుల సమక్షంలో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కోసం హీరో నాని ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. కాన్సర్ట్ వేదికపై ప్రదర్శించిన మరుసటి రోజు (ఆగస్టు 29న) ఈ పాట డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో శ్రోతలకు అందుబాటులోకి రానుంది.

ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ తెచ్చిన హంగామా తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన ఈ కొత్త మాస్ మెలోడీ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద చార్ట్‌బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 24న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.