తెలుగులో విడుదల కానున్న మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

Malayalam Blockbuster Bethlehem Kudumba Unit to Be Released in Telugu

మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నివిన్ పౌలీ మరియు ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. భావన స్టూడియోస్ పతాకంపై ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ మరియు శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళంలో కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో ఫ్యూచర్ రనప్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వినోదంతో పాటు మంచి ఎమోషన్స్ ఉన్న కథ కావడంతో తెలుగులోనూ ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.