సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారానికి దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నారని, ఈ కాంబో 2028 సంక్రాంతికి రానుందంటూ వార్తలు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు తనకు ఎప్పటికీ ఎంతో ఆత్మీయుడని, ఆయనపై తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం తమ కాంబినేషన్ గురించి నెట్టింట వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో వీరి కాంబో రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టగా, మహేష్ బాబు రాజమౌళితో ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























