‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ రోజు ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో అసలు ఆ రోజు ఏం రివీల్ చేయబోతున్నారనే ఆసక్తి మూవీ లవర్స్‌లో మరింత పెరిగింది.
పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. RKD Studios బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ‘మహాకాళి’లో భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించే ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ‘హనుమాన్’తో మొదలైన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
‘హనుమాన్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో ‘మహాకాళి’పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆగస్టు 24న రాబోయే అప్‌డేట్ సినిమా ప్రపంచాన్ని మరింతగా పరిచయం చేయడంతో పాటు, త్వరలో ప్రారంభం కానున్న ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ చేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























