వెంకటేష్ -కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ … జనవరి 12 విడుదల

Venkatesh–Kalyan Ram Multistarrer Titled January 12 Vidudala

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవేటెడ్ టైటిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తాత్కాలికంగా ప్రచారంలో ఉన్న పేర్లకు స్వస్తి పలుకుతూ, ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” అనే సరికొత్త, వినూత్నమైన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఈ టైటిల్‌కు “బావ బామ్మర్ది సౌజన్యంతో” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినిమాలో వెంకీ-కళ్యాణ్ రామ్‌ల మధ్య ఉండే అలరించే వినోదాత్మక బంధాన్ని స్పష్టం చేశారు.ఈ టైటిల్ ను కూడా అనిల్ రావిపూడి తనదైన స్టయిల్లో ప్రమోషనల్ వీడియోతో అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ధృవీకరించింది. షైన్స్క్రీన్స్, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా, రాక్‌స్టార్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకటేష్-కళ్యాణ్ రామ్‌ల మాస్ అండ్ వినోదాత్మక నటన తోడవుతుండటంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల పండుగ ఖాయమని అభిమానులు ,బలంగా విశ్వసిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.