చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Chennai Love Story OTT Streaming Date Revealed

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లివ్’ సొంతం చేసుకుంది. ఆగస్టు 21 నుంచి ఈ చిత్రాన్ని సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ఒకేసారి అందుబాటులోకి రానుంది.

రవి నంబూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి ప్రేమలోని అనుభూతులను, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఎంతో సహజంగా ఆవిష్కరించింది. థియేటర్లలో చూడటం మిస్ అయిన సినీ ప్రియులు ఆగస్టు 21 నుంచి సోనీ లివ్‌లో డిజిటల్‌గా ఈ కథను ఆస్వాదించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.