తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం ‘జన నాయగన్’.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ‘జీ5’ ఈ చిత్రం యొక్క భారీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించగా , ప్రముఖ నటి మమితా బైజు కీలక పాత్ర పోషించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం అందించారు.
తమిళంతో పాటు తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను వీక్షించలేకపోయిన అభిమానులు మరియు సినీ ప్రియులు ఆగస్టు 21 నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఇంట్లోనే ఉండి ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























