మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా శబరిమల యాత్ర లేదా ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే భక్తి చిత్రం కాదని, ఇది ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తీవ్రమైన మధ్యపాన వ్యసనం (ఆల్కహాల్ అలవాటు) ఉన్న ఒక తండ్రి కథ ఇది.: తన కూతురి కోరిక మేరకు, ఆమె భవిష్యత్తు కోసం ఆ తండ్రి తన వ్యసనాన్ని వదిలేసి 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప మాల (దీక్ష) ధరించాలని నిర్ణయించుకుంటాడు.
ఈ 41 రోజుల దీక్షా సమయంలో అతనికి ఎదురైన అనూహ్య పరిస్థితులు, పడే తపన ఏమిటనేది ప్రధానాంశం. కథ ఎమోషనల్ డ్రామాగా ప్రారంభమై, ఊహించని మలుపులతో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా మారుతుందని దర్శకుడు వెల్లడించారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర కూతురి పాత్రలో కనిపిస్తోంది. ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























