న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్‌కు నేచురల్ స్టార్ నాని అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీడియోలో నితిన్ ఇంజినీరింగ్ పుస్తకాల మధ్య నిద్రపోతూ కనిపిస్తాడు. అతని ముందు ‘గరం గోపాల్’, ‘ఆమెకు ఆమెంటే ఇష్టం’, ‘వత్రం వెంకన్న’ వంటి వినూత్న శీర్షికలు ఉన్న పుస్తకాలు ఉండగా, వాటి రచయితగా ‘రుక్మిణి’ పేరు ప్రస్తావనకు వస్తుంది. నాని రుక్మిణి గురించి వివరిస్తుండగా, చివర్లో నితిన్ “ఆమె నా భార్య” అని చెప్పడంతో గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ముగిసింది.ఈ ఒక్క గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్‌తో కూడిన ఒక వినూత్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని అర్థమవుతోంది.నాని సోదరి దీప్తి ఘంటా ఈసినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























