జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ రేపు విడుదలకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ లో భాగమై ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రూమర్స్‌పై బిగ్ క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి బాలకృష్ణతో తాను తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని విజయ్ చూశారని, ఆ సినిమాలోని ఎమోషన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయని అనిల్ వెల్లడించారు. ‘ది గోట్’ షూటింగ్ సమయంలో విజయ్ తనను ప్రత్యేకంగా పిలిపించి, సినిమా తీసిన విధానాన్ని ఎంతో ప్రశంసించారని తెలిపారు. ఆ అభినందనలు వినగానే తనకు మాటలు రాలేదని, ఆ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’ నుంచి కొన్ని కీలక సన్నివేశాల హక్కులను KVN ప్రొడక్షన్స్ అధికారికంగా కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. అయితే ‘జన నాయగన్’ కేవలం ఆ పాయింట్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక కొత్త కథ అని, దర్శకుడు హెచ్. వినోద్ తమ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పూర్తిగా మార్చి సరికొత్తగా తెరకెక్కించారని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా కొత్తగా ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.