అక్కినేని అఖిల్ సరికొత్త ఊరమాస్ అవతారంలో నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా, అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ‘అఖిల్ 2.0’ ఈజ్ హియర్ అంటూ అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటుండగా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని రేంజ్లో లౌడ్‌గా రీసౌండ్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న మంచి సినిమాను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని ‘లెనిన్’ కలెక్షన్లు మరోసారి నిరూపించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఏకంగా 16.7 కోట్ల రూపాయలకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. అటు నార్త్ అమెరికాలో ఈసినిమా 250k డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈరోజు ఈసినిమా బుక్ మై షోలో గంటకు 17వేల టికెట్లకు పైగా బుకింగ్స్ తో దూసుకుపోతుంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన విధానం, థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ చేశాయి.
అఖిల్ సరికొత్త మేకోవర్ మరియు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ స్థాయి రికార్డు వసూళ్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన ‘లెనిన్’ చిత్రం, వీకెండ్లో మరిన్ని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. లాంగ్ రన్లో ఈ చిత్రం అఖిల్ కెరీర్లోనే మైల్‌స్టోన్‌గా నిలిచేలా సరికొత్త నంబర్స్‌ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























