హృదయం మురళి అందరికీ రిలేట్ అయ్యే సినిమా –  అథర్వా మురళి

Hrudayam Murali Is a Film Everyone Can Relate To says Atharvaa Murali

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ చాలా అద్భుతం. నా గత చిత్రాలకు ఎంతో ప్రేమను అందించారు. ‘హృదయం మురళి’  స్పెషల్ సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

తమన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఒక మంచి పాత్రలో కూడా నటించారు. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. ఫహాద్ ఫాజిల్ గారు కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ అందించారు. ఈ సినిమా అందరూ రిలేట్ అయ్యే సినిమా. వన్‌సైడ్ లవర్స్ ఈ సినిమాతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరగా ఉండే సినిమా ఇది. జూలై 10న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.