నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది – పవన్ కళ్యాణ్

Pawan Kalyan’s Emotional Tweet on Niranjan’s Demise

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎంతగానో అభిమానించే చిన్నారి నిరంజన్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ద్వారా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న హనుమకొండకు చెందిన చిన్నారి నిరంజన్, తనను చూడాలని ఆశపడుతున్నాడని తెలుసుకుని పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్‌ను చూసి ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, చిరునవ్వు ఎందరినో కదిలించింది. దురదృష్టవశాత్తూ నిరంజన్ వ్యాధితో పోరాడుతూ ఈరోజు కన్నుమూయడంతో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

వ్యాధితో అంతటి బాధను అనుభవిస్తూ కూడా నిరంజన్ చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని పవన్ పేర్కొన్నారు. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారి మనల్ని విడిచివెళ్లడం ఎంతో బాధాకరమని చెప్తూ, ఆ నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే పుత్రశోకంతో అల్లాడిపోతున్న అతని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.