మెగా 158 షూట్ అప్డేట్

Intense Action Schedule Begins for Mega 158

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మెగా 158(వర్కింగ్ టైటిల్) . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ బయటికి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, మునుపెన్నడూ చూడని ఒక (భారీ యాక్షన్ సీక్వెన్స్) ను చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో, వందలాది మంది ఫైటర్లతో ఈ ఫైట్ సీన్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు.

ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గకుండా, ఎంతో రిస్క్‌తో కూడిన పవర్‌ఫుల్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తూ సెట్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వింటేజ్ చిరు మాస్ ఎనర్జీని గుర్తుచేసేలా ఉండే ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్లలో ప్రేక్షకులకు, మెగా అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ టీజర్‌ను చిరు బర్త్ డే ఆగస్టు 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ఫైట్ అప్‌డేట్‌తో ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే బాబీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.