మల్టీ స్టారర్ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన వెంకీ

Venkatesh Joins the Shoot of #VenkyAnil5 #NKRAR2

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోయే నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం (#VenkyAnil5 / #NKRAR2) షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా సరికొత్త షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ ఈరోజు నుంచే జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో ఈ కీలక షెడ్యూల్ ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతోంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా వెంకీ – కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేయడమే కాకుండా, సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం నమ్మకంగా చెప్తోంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌తో రాబోతున్న ఈ మల్టీస్టారర్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.