ఆల్ఫా సెన్సార్ పనులు పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

Alpha Completes Censor Formalities

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ లో భాగం కాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్ఫా’ . శివ్‌ రావైల్‌ దర్శకత్వంలో బాలీవుడ్ క్వీన్ అలియా భట్, శర్వరి లీడ్ రోల్స్ పోషించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ బోర్డు పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఇప్పటికే ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాకు క్లీన్ చిట్ ఇస్తూనే, సెన్సార్ బోర్డు మేకర్స్‌కు కొన్ని కీలక మార్పులు చేయాలని సూచించింది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని వయలెంట్ సన్నివేశాల తీవ్రతను తగ్గించి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ దృశ్యాలను పెట్టాలని కోరింది. ప్రథమార్ధం లోని ఒక డైలాగ్‌ను పూర్తిగా తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో పాటు మరో రెండు యాక్షన్ సంఘటనల విజువల్స్ నిడివిని కూడా తగ్గించమని సూచించింది. మద్యం సేవించే సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్‌పై హెచ్చరిక వేయాలని, సినిమాలోని అన్ని పాటలకూ సబ్‌టైటిల్స్ జోడించాలని కోరింది. అంతేకాకుండా, మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అధికారిక అనుమతి లేఖను సమర్పించాల్సిందిగా బోర్డు స్పష్టం చేసింది. చిత్రబృందం ఈ మార్పులన్నీ పూర్తి చేసి ఫైనల్ కాపీని రెడీ చేసింది.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ భారీ యాక్షన్ డ్రామా నిడివి (రన్‌టైమ్) 2 గంటల 20 నిమిషాల 48 సెకన్లుగా లాక్ అయింది. అంటే సుమారు 140 నిమిషాల పాటు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ యాక్షన్ అనుభూతిని పొందనున్నారు. ఈ చిత్రంలో బాబీ దియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో మెరవబోతుండటం విశేషం. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ లో వస్తున్న మొదటి ఫీమేల్ సెంట్రిక్ స్పై మూవీ కావడంతో ‘ఆల్ఫా’ పై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.