యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు -తమిళంలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయన నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ‘సిగ్మా’ . కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు వున్నాయి.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా సందీప్ కిషన్ ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగ్ పార్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని ఒక పవర్ఫుల్, రగ్గడ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. లండన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన జాసన్ సంజయ్, సందీప్‌ను సరికొత్త హాలీవుడ్ స్టైల్ యాక్షన్ జోనర్లో ప్రెజెంట్ చేయబోతున్నారట.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తోంది. డబ్బింగ్ కూడా పూర్తి కావడంతో సినిమాను అనుకున్న తేదీకే విడుదలచేయనున్నారు.జులై 31న ఈసినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది. మరి డైరెక్టర్ గా జాసన్ సంజయ్ ఈసినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























