ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడనుంది. ‘అరవింద సమేత’ వంటి సాలిడ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా దేవుడు సుబ్రమణ్య స్వామి కథాంశం చుట్టూ తిరిగే ఒక భారీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ లో తెరక్కనుండడం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవుదులు లేవు . ఇటీవలె ఎన్టీఆర్ చేతిలో “మురుగ” అనే పుస్తకం ఉన్న ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ ఈ మైథాలజీ కథను నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్టుగా, అత్యంత భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కించబోతున్నారని సమాచారం.
ఎన్టీఆర్‌ను సరికొత్త డివైన్ అండ్ పవర్‌ఫుల్ రోల్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం రాబోయే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో టైటిల్ మరియు పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.హారిక హాసిని క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























