రామ్ 23 ప్రారంభం … నేటి నుండే షూటింగ్

RAPO 23 Starts Rolling from Today

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రామ్ హీరోగా నటిస్తూ.. ఆయనే స్వయంగా కథ-స్క్రీన్‌ప్లే అందిస్తూ తొలిసారి మెగాఫోన్ పడుతున్న 23వ చిత్రం (#RAPO23) ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘ది లోన్ వోల్ఫ్’అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ హోమ్ బ్యానర్ ‘రాపో సినిమాటిక్స్’ పతాకంపై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో రామ్ బాబాయ్, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా.. మురళీ పోతినేని కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాలని రామ్ గట్టి ప్లాన్ వేశారు. అందుకే ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోని దిగ్గజ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. ప్రముఖ ల్యాండ్‌మార్క్ సినిమాలకు పనిచేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తుండగా.. ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాష్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ రేంజ్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వర్క్ చేస్తున్నారు. హీరోగా, దర్శకుడిగా రామ్ చూపిస్తున్న ఈ మల్టీ టాలెంట్‌తో ‘ది లోన్ వోల్ఫ్’ బాక్సాఫీస్ వద్ద వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.