శివపుత్రుడిగా ఎన్టీఆర్ .. అనిరుధ్ మ్యూజిక్

NTR–Trivikram Film Officially Announced

ఎట్టకేలకు నందమూరి అభిమానులు ఎదురుచూసిన క్రేజీ అనౌన్స్ మెంట్ అధికారికంగా వచ్చేసింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #NTRxTrivikram అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందు నుంచి అనుకున్నట్లే ఈ సినిమా లార్డ్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి) బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. “The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander.” (శివుని కుమారుడు, పార్వతి గర్వకారణం, సర్వసైన్యాధ్యక్షుడు) అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన క్యాప్షన్ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతోంది. ఈ పోస్టర్‌లో ఒక భారీ యుద్ధ భూమి బ్యాక్‌డ్రాప్‌లో.. త్రిశూలం, డిఎన్‌ఏ చైన్ కలగలిసిన ఆయుధం అత్యంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్-అనిరుధ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో మ్యూజిక్ పరంగా పూనకాలు ఖాయం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్) సంయుక్తంగా ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ పెన్ పవర్, తారక్ యాక్టింగ్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ ఈసినిమాకు వెళ్లనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.