మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’ ను జూన్ 29న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ నటిస్తుండగా సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. ఆగస్టు 21, 2026న ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. వరుస పరాజయాలతో వెనకబడ్డ తమ అభిమాన హీరో ఇరుముడి తో కం బ్యాక్ ఇవ్వనున్నాడన్న ఆశతో వున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























