స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయోత్సాహంలో చిత్ర బృందం వైజాగ్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌పై వచ్చిన అధికారిక ప్రకటన.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్ర రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి తాము ఎంతో ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి, “మా ఇంటి బంగారం పార్ట్-2 వస్తే చూస్తారా?” అని ప్రశ్నించారు. వెంటనే సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. అభిమానుల నుంచి వచ్చిన ఈ భారీ స్పందనతో ఆయన ‘మా ఇంటి బంగారం 2’ను అధికారికంగా ప్రకటించారు.
“ఇప్పటికే నా మైండ్‌లో సీక్వెల్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన సేమ్ టీమ్ మళ్లీ సీక్వెల్ కోసం వర్క్ చేస్తుంది. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్స్పిరేషన్ నాకు కలగడం ఇదే తొలిసారి. ‘మా ఇంటి బంగారం 2’ డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్మెంట్తో ఉంటుంది” అని రాజ్ నిడిమోరు సంకేతాలు ఇచ్చారు. ఈ చిత్రంలో సమంతతో పాటు దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ఇక ఈసినిమా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. మొదటి వారంలో 60 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























