నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రూట్ మార్చింది. ఇప్పటివరకు తన నటనతో, డ్యాన్స్‌తో, హోమ్లీ లుక్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఫస్ట్ టైం థియేటర్లలో యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ మూవీ ‘ధనుష్ 55’ (#D55) కి సంబంధించిన ఈ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది.
‘అమరన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘ధనుష్ 55’ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఓ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది.
కెరీర్ ప్రారంభం నుండి ‘గర్ల్ నెక్స్ట్ డోర్’ (పక్కింటి అమ్మాయి) తరహా పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సాయి పల్లవి.. ఇందులో పక్కా మాస్ అండ్ యాక్షన్ రోల్ చేస్తోంది.
సినిమాలో కేవలం పోలీస్ డ్రెస్ వేసుకోవడమే కాదు.. హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్, రిస్కీ బైక్ చేజ్ సీక్వెన్స్‌లలో ఆమె నటన ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయబోతోంది. ఈ రియలిస్టిక్ స్టంట్స్ పర్ఫెక్ట్గా చేయడం కోసం సాయి పల్లవి కొన్నాళ్ల పాటు ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకుందని టాక్.
గతంలో ‘మారి 2’ సినిమాలో “రౌడీ బేబీ” పాటతో ఈ కాంబినేషన్ యూట్యూబ్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ #D55 లో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అంచనాలు స్కై హై లో ఉన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి ఇచ్చే మాస్ ఎంట్రీ, ధనుష్ సరసన ఆమె పవర్ఫుల్ లుక్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























