కరుప్పు టీమ్‌కు సూర్య బంపర్ గిఫ్ట్.. టెక్నీషియన్లకు ఖరీదైన లగ్జరీ కార్లు కానుక

Suriya Rewards Karuppu Technicians with Luxury Cars

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిం‌చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌ లో చేరి సంచలన విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ల్యాండ్‌మార్క్ సక్సెస్‌తో ఖుషీగా ఉన్న సూర్య.. సినిమా విజయానికి అహర్నిశలు శ్రమించిన చిత్ర సాంకేతిక నిపుణులకు (టెక్నీషియన్లకు) ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన టీమ్ మెంబర్స్‌కు సూర్య ఒక్కొక్కరికి దాదాపు రూ. 30 లక్షల విలువైన సరికొత్త మహీంద్రా BE6 బాట్‌మ్యాన్ ఎడిషన్ లగ్జరీ కార్లను బహుమతిగా అందించారు.

కరుప్పు చిత్రానికి తన అద్భుతమైన విజువల్స్, లైటింగ్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఫేమస్ సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణుకు సూర్య ఈ కారును కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో కారుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “ఇది దేవుడి లీలే! థాంక్యూ సూర్య సార్. మీకు చాలా పెద్ద మనసు ఉంది” అంటూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచి, తన ‘గాడ్ మోడ్’ , ‘వీరప్ప’ వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఊపేసిన యంగ్ కంపోజర్ సాయి అభ్యంకర్‌కు కూడా సూర్య ఈ కార్ గిఫ్ట్ ఇచ్చారు. సాయి స్పందిస్తూ.. “లవ్ యూ డియర్ సూర్య సార్” అని రాసుకొచ్చారు.

ఇక సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా అత్యంత గ్రిప్పింగ్‌గా ఎడిట్ చేసిన ఎడిటర్ కలైవానన్ కూడా ఈ లగ్జరీ కారును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విక్రమ్ సినిమాలోని ‘రోలెక్స్’ డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. “నా రోలెక్స్ అన్నయ్య నుంచి లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్ దొరికింది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై పోరాడే ఒక లాయర్ రూపంలో ఉన్న గార్డియన్ దైవం కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సూర్య సరసన త్రిష ( హీరోయిన్‌గా నటించింది. సినిమా ఘనవిజయం సాధించినప్పుడు హీరోలు దర్శకులకు కార్లు ఇవ్వడం కామన్ కానీ, ఇలా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ వంటి టెక్నీషియన్లను ప్రత్యేకంగా గుర్తించి లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇవ్వడం సూర్య గొప్ప మనసుకే నిదర్శనమంటూ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.