మనందరం రామ్ చరణ్ గారి అభిమానులమే – జాన్వీ కపూర్

we are all fans of ram charan says janhvi kapoor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హల్లల్లల్లో’ ని భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ లో లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’లో చాలా గొప్ప సందేశం ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. మనందరం రామ్ చరణ్ గారి అభిమానులమే. ఈ సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం, నిజాయితీ, కష్టపడి పనిచేసిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతి పాత్రను ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు వంటి ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఆయన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసింది. అలాగే బుచ్చిబాబు గారికి థాంక్ యూ. ఆయన విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘పెద్ది’ ఒక అద్భుతమైన సినిమా. జూన్ 4న మనమంతా థియేటర్లలో కలుద్దాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.