కర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Kara OTT Release Date Locked

కోలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ . ‘పోరుదొండై’ (తెలుగులో ‘నేను సింబా’) వంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత నెల ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ధనుష్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే, థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. విడుదలైన నెల రోజులు కూడా కాకముందే (సరిగ్గా 29 రోజుల్లోనే) ‘కర’ ఓటీటీ బాట పట్టింది.

ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘కర’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ వారం మే 28 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోని అప్‌కమింగ్ సెక్షన్‌లో ఈ సినిమాను మే 28 రిలీజ్ డేట్‌తో లిస్ట్ చేశారు.

ఈ సినిమాలో ధనుష్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, కె.ఎస్. రవికుమార్, కరుణాస్, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.