#DQ41 కీలక షెడ్యూల్ పూర్తి 

DQ41 Team Successfully Completes Key Schedule

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్రం #DQ41 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రవి నెలకుడితి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్యానర్‌ నుంచి వస్తున్న 10వ చిత్రం #SLV10గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర బృందం మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి మధ్య కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. సెట్స్ నుంచి విడుదలైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  వింటర్ అవుట్ ఫిట్స్ లో  దుల్కర్ ఆకట్టుకున్నారు, పూజా హెగ్డే కూడా తన అందమైన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా కనిపించారు.

ఈ ఫోటోలు షూటింగ్ సమయంలోని రియల్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో వర్షపు జల్లుల మధ్య గొడుగుల కింద దుల్కర్, పూజా కలిసి నవ్వులు పంచుకుంటూ కనిపిస్తే, మరో ఫోటోలో బ్యాక్‌ప్యాక్స్, తాడుపై వంతెన, పర్వత ప్రాంత ప్రార్థనా జెండాల మధ్య ట్రావెల్ మూవీ ఫీల్‌ను తీసుకొచ్చేలా ఉంది. మరో ఫోటోలో అడవుల మధ్య ఉన్న ఆలయం ముందు మొత్తం చిత్ర బృందం కలిసి కనిపించింది. దుల్కర్, పూజా కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. వారి మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది,

ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.