టాలీవుడ్లో తనదైన టైమింగ్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే క్రేజీ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ . ‘మత్తు వదలరా’ వంటి విభిన్నమైన సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన క్రేజీ డైరెక్టర్ రితేష్ రాణా ఈ సినిమాను తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేటి నుంచే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ జెయింట్ ‘జియో హాట్ స్టార్’ వేదికగా ‘జెట్లీ’ సినిమా ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం 4 భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులో ఉంది.
కథేంటంటే? :
ప్రముఖ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రజాపతి (అజయ్) కస్టమర్ల డబ్బుతో పెద్ద స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. అతన్ని అరెస్ట్ చేసి ఇండియా తీసుకురావడానికి ఇంటెలిజెన్స్ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) రంగంలోకి దిగుతుంది. దుబాయ్ నుండి కొచ్చికి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రజాపతిని తీసుకొస్తున్న టైంలో కొందరు అతనిపై ఎటాక్ చేస్తారు. అదే విమానంలోకి గతం మర్చిపోయిన స్థితిలో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఫ్లైట్ లోపల జరిగిన హైజాక్ డ్రామా ఏంటి? వేదవ్యాస్ అసలు ఎవరు? శత్రువుల నుండి ప్రజాపతిని అతను ఎలా కాపాడాడు? అనేదే ఈ సినిమా కథ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























