దక్షిణాది సినిమాకి కొత్త నడకలు నేర్పించిన దర్శకులలో శంకర్ ఒకడు. తొలి చిత్రం `జెంటిల్ మేన్` నుంచి తాజాగా విడుదలైన `2.0` వరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత శంకర్‌ది. అంతేకాదు… సంగీతం పరంగానూ, సాంకేతికంగానూ ఆయన సినిమాలు ఉన్నతంగా ఉండి అలరించాయి. కాగా… యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన యూత్‌ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ `బాయ్స్` అయితే అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమా ద్వారానే సిద్ధార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే… నేటి సంచలన సంగీత దర్శకుడు తమన్ కూడా ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతోందని కోలీవుడ్ టాక్. సిద్ధార్థ్, తమన్ ఈ చిత్రంలోనూ కొనసాగుతారట. అయితే… ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తాడా? లేదంటే ఆయన శిష్యుడు ఎవరైనా టేకప్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి… మూడేళ్ళ క్రితమే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే… ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. మరి… ఈ సారైనా `బాయ్స్` సీక్వెల్ ప్లాన్ అమలులోకి వస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: