వీరభద్రుడు ట్రైలర్ రిలీజ్

Action-Packed Veerabhadrudu Trailer Is Here

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జోడీగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ సూర్య అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సూర్య లాయర్‌గా కనిపిస్తూనే, తన గతానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో అలరించబోతున్నారు. ‘రుద్ర’ అనే పాత్రలో ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

అక్కినేని నాగార్జున గారి ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తోంది. తాజా ట్రైలర్ లాంచ్ ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నటరాజన్ సుబ్రమణ్యం ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు.ఈ చిత్రం మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.