దృశ్యం 3 తెలుగు రీమేక్ లేనట్లే .. ట్రైలర్ రిలీజ్

No Telugu Remake for Drishyam 3; Trailer Out Now

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సిరీస్ నుంచి మూడో భాగం దృశ్యం 3 రానుందని తెలిసిందే. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గత రెండు భాగాలను వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేసినప్పటికీ, మూడవ భాగాన్ని మాత్రం కేవలం డబ్బింగ్ రూపంలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌నే తెలుగులోకి డబ్బింగ్ చేసి మే 21, 2026న విడుదల చేయబోతున్నారు.

అందులో భాగంగా తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేయకుండా, మలయాళ చిత్రంతో పాటే డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ మాత్రం అజయ్ దేవగన్ హీరోగా అక్టోబర్ 2, 2026న విడుదల కానుంది.

సినిమాలోని సస్పెన్స్ లీక్ అవ్వకుండా ఉండటానికి మరియు పాన్-ఇండియా అప్పీల్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వెంకటేష్ గారి నటనను ‘రాంబాబు’గా చూడాలనుకున్న అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా, ఈసారి అసలైన ‘జార్జ్ కుట్టి’ (మోహన్‌లాల్) సస్పెన్స్‌ను నేరుగా తెలుగులో చూడవచ్చు.

ఇక దృశ్యం 3 ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమాకు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.