ఓటీటీలోకి రానున్న డెకాయిట్

Dacoit Set for OTT Release

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో క్షణం, గూఢచారి వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్, ఈసారి పూర్తి స్థాయి మాస్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో కనిపించారు. లవ్ స్టోరీగా దీనిని దర్శకుడు షనీల్ డియో అద్భుతంగా తెరకెక్కించారు.ఇందులో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం విశేషం.

అడవి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంటి వద్దే ప్రైమ్ వీడియోలో ఈ గ్యాంగ్‌స్టర్ ప్రేమకథను వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.