ప్రముఖ సినీ నిర్మాత,సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి దుర్మరణం చెందారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్ భగత్రామ్ చౌదరి. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1988లో మలయాళ చిత్రం ‘ఆదిపాపమ్’తో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తమిళ చిత్రం ‘పుదువసంతం’తో భారీ విజయాన్ని అందుకున్నారు. తెలుగులో సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, శివరామరాజు, సంక్రాంతి, వసంతం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ (2022) ఆయన తెలుగులో నిర్మించిన చివరి భారీ చిత్రం.
ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు హీరో జీవా కాగా, మరొకరు నిర్మాత జితన్ రమేష్. తన 100వ చిత్రాన్ని రజనీకాంత్‌తో నిర్మించాలన్నది ఆయన తీరని కోరికగా మిగిలిపోయింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























