కామెడీ యాక్టర్ సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్ లీ’ రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా డబ్బింగ్ పనులు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం హీరో సత్య తన రోల్ కి డబ్బింగ్ చెప్తున్నాడు. ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ సినిమాలతో విలక్షణమైన కామెడీని పరిచయం చేసిన రితేష్ రాణా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా కథ దాదాపు మొత్తం ఒక విమానం లోనే జరుగుతుంది. ఒక కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వెన్నెల కిషోర్, అజయ్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సత్య తన మార్క్ టైమింగ్‌తో ఈ సినిమాలో హీరోగా ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























