మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న మెగా 158కి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించడం దాదాపు ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదట ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, చివరకు దర్శకుడు బాబీ తన ‘డాకు మహారాజ్’ కు అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడంతో తమన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈసారి తమన్ ఎనర్జీని జోడించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి మార్చి 14, 2026 న హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం.
ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలోనూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటించనుండగా, ఆయన కుమార్తె పాత్రలో మలయాళ యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సివుంది.
ఈ చిత్రాన్ని కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇది తెలుగులో వారి మొదటి సినిమా. మార్చి చివరి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
గతంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’కు తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో చిరు కోసం తమన్ ఎలాంటి పాటలు మరియు బిజిఎం ఇస్తారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































