తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గానూ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో దివంగత నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయనను చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో మరియు ఎంజీఆర్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా తమిళ నటులు విశాల్, నాజర్ వంటి వారు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఆర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి చౌకబారు పోలికలతో మాట్లాడటం సరికాదని వారు రాజేంద్రప్రసాద్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, కేవలం నోరుజారడం వల్ల జరిగిన పొరపాటు మాత్రమేనని వివరణ ఇచ్చారు.
తాను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తానని, చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే రోజుల నుండే ఆయనపై తనకు అపారమైన గౌరవం ఉందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తన మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరుతూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన హామీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























