మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన ప్రభావాన్ని చాటుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.ఒక తెలుగు సినిమాకు డిజిటల్ వేదికపై ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే తొలిసారి అని జీ5 సంస్థ అధికారికంగా వెల్లడించింది.
నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























