శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

Sri Chidambaram Garu Locks OTT Release Date

ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన కేవలం రెండు వారాల లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 19, నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని అందమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు.

మెల్లకన్ను కారణంగా సమాజం నుండి ఎదురయ్యే అవమానాలను భరిస్తూ, ఆత్మన్యూనతా భావంతో బతికే ఒక యువకుడు.. తన లోపాన్ని ఎలా జయించాడు? ప్రేమ అతనికి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది? అనే అంశాలను దర్శకుడు వినయ్ రత్నం చాలా సహజంగా తెరకెక్కించారు. మలయాళ చిత్రాలను తలపించేలా సహజమైన పాత్రలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.