375 కోట్లు దాటిన మన శంకర వరప్రసాద్ గారు

Mana Shankaravaraprasad Garu Crosses ₹375 Crore Mark

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈరోజుతో ఈసినిమా 25 రోజులు పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన కేవలం 25 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. తద్వారా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీజనల్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ భారీ విజయం సాధించిన చిత్రం ఫిబ్రవరి 11, 2026 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. వాలెంటైన్స్ వీక్ కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ వంటి మొత్తం ఏడు భాషల్లో అందుబాటులోకి రాబోతోంది.

ఈ సినిమా కేవలం నైజాం ఏరియాలోనే 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఆశ్చర్యపరిచింది. అలాగే ‘బుక్ మై షో’లో ఇప్పటివరకు 4 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి ఒక ఎన్‌ఎస్‌జీ ఆఫీసర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో కూడిన అతిథి పాత్రలో మెరిశారు.

షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమా విజయానికి మరో ప్రధాన కారణమైంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.