గుండెపోటుతో కన్నుమూసిన కె. భాగ్యరాజ్

Veteran Actor-Director K. Bhagyaraj Passes Away at 73

ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, పత్రికా సంపాదకుడిగా మరియు సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఆయన సుమారు 75 చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.

ఆయన 25 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ‘ముంధానై ముడిచ్చు’ (తెలుగులో మూడు ముళ్ళు), ‘చిన్నవీడు’, ‘ఇదు నమ్మ ఆళు’ వంటి విభిన్నమైన సామాజిక, కుటుంబ కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించి, స్క్రీన్‌ప్లే విభాగంలో కొత్త ఒరవడిని సృష్టించారు. అందుకే ఆయనను చిత్ర పరిశ్రమలో ‘స్క్రీన్‌ప్లే మాస్టర్’ అని పిలుచుకుంటారు.

కాగా, ఇటీవల కాలంలో ఆయన నేరుగా పలు తెలుగు సినిమాల్లోనూ తన నటనతో అలరించారు.తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ (2019) సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు తాత పాత్రలో మెప్పించారు.ఇటీవల విడుదలై ప్రశంసలు పొందిన నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ సినిమా ’35-చిన్న కథ కాదు’అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన ‘కుబేర’ చిత్రంలోనూ భాగ్యరాజ్ నటించారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ కూడా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి శంతను (నటుడు), శరణ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చెన్నైలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని అభిమానుల, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచగా.. కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు దిగ్గజాలు ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.