యూత్ లో చెరగని ముద్ర వేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఇప్పుడు సీక్వెల్ ‘ENE Repeat’తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి రీయూనియన్ అవుతుండగా, శ్రీనాథ్ మాగంటి ఈ టీంకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రపంచవ్యాప్త నవంబర్ 19ని విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రం (మొదటి భాగం) విడుదలై ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి ‘కన్యా రాశి’ గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా, అందరినీ ఆకట్టుకునే ఫ్రెండ్షిప్ యాంథమ్ నేపథ్యంతో ఒక ‘ఫీల్-గుడ్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇటీవల రీ-రిలీజ్‌లోనూ అద్భుతమైన స్పందన దక్కించుకోవడంతో, ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
పార్ట్ వన్ లోని ప్రత్యేకతను కొనసాగించేలా ఈ సీక్వెల్‌కు ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తుండగా, రాజేష్ పెంటకోట, సాలీ వైట్ ప్రొడక్షన్ డిజైన్‌ను రూపొందిస్తున్నారు.విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























