ధురంధర్ 2 తెలుగు టీజర్ రిలీజ్

Telugu Teaser of Dhurandhar 2 Is Out Now

రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ధురంధర్ : ది రివేంజ్. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం సాధించడం తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈరోజు ధురంధర్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రణవీర్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆలాగే తను ల్యారీ ప్రాంతానికి బాద్షా అవ్వడం ఇవ్వని చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చివర్లో ఇది కొత్త భారతదేశం .. సరిహద్దులు దాటి చొచ్చుకొని వెళ్లి దెబ్బకొట్టి తీరుతుంది అనే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.ఓవరాల్ గా ఈసినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఉండగా తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను మరింతగా పెంచేసింది.హిందీ తోపాటు తెలుగు , కన్నడ , మలయాళ ,తమిళ భాషల్లో ఈసినిమా విడుదలకానుంది.

ఫస్ట్ పార్ట్ థియేటర్లలో కేవలం హిందీలోనే విడుదలై చరిత్ర సృష్టించింది. ఇక ధురంధర్ 2 అన్ని భాషల్లో విడుదలకానున్నడంతో మొదటి రోజే 100కోట్ల వసూళ్లను రాబట్టుకోనుంది. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇక రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ధురంధర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ప్రస్తుతం హిందీ , తెలుగు , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.