షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాండ్ మేళం

Band Melam Completes Its Shoot

కోర్టు ఫేమ్ హార్ష్ రోషన్ , శ్రీదేవి జంటగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ ప్రొడక్షన్ లో, మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘బ్యాండ్ మేళం’.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. “ప్రతి లయలోనూ ఒక భావోద్వేగం ఉంటుంది” (Every beat has an emotion) అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను కావ్య మరియు శ్రావ్య నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, శివ ముప్పరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రూపొందుతుంది ఈసినిమా.

ఇక గత ఏడాది కోర్టు తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న హార్ష్ రోషన్ , శ్రీదేవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో బ్యాండ్ మేళం పై మంచి అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈసినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.