తెలుగులో విడుదలకానున్న ధురంధర్ 2 … రిలీజ్ డేట్ ఫిక్స్ 

Dhurandhar 2 Also Getting a Telugu Release

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ కు సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’ రానుందని తెలిసిందే.మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై 1300కోట్లకుపైగా  వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకోగా, ఈ రెండో భాగాన్ని మాత్రం సౌత్ ఇండియా ఆడియన్సు  కోసం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ టైటిల్ తో   విడుదల కానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఇక  ఈ చిత్రం రిలీజ్  వాయిదా పడుతున్నట్లు వచ్చి న వాస్తవం లేదని  మేకర్స్  ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అనుకున్న తేదీ ప్రకారం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను నేడు (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.

థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా  ధురంధర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.గత వారం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈసినిమా రికార్డు వ్యూస్ ను రాబట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులనుండి విశేషమైన స్పందన వస్తుంది. దాంతో  సీక్వెల్‌ గా వస్తున్న ధురంధర్ 2పై  భారీ అంచనాలు నెలకొన్నాయి.హైప్ చూస్తుంటే ధురంధర్ 2 మొదటి రోజే 100కోట్లకుపైనే రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.